రాజ్యాంగ ప్రదాతకు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

తాడేపల్లి: రాజ్యాంగ ప్రదాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళులర్పించారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ సీఎం వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. భారతదేశ సాంఘిక మనస్సాక్షిని మేల్కొల్పడానికి, సమానత్వ హక్కు కోసం అంబేడ్కర్‌ పోరాడారన్నారు. అంబేడ్కర్‌ సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో శుక్ర‌వారం భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హించారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే నాగార్జున త‌దిత‌రులు అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి నివాళుర్పించారు.