Listen to the NEWS
|
తయారీ విధానము .
ఒక కప్పు మినపప్పు నాలుగు గంటల పాటు నీళ్ళలో నానబెట్టి తర్వాత పప్పును గ్రైండర్ లో వేసుకుని పిండిని గారెలు వేయుటకు అనువుగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
తర్వాత పిండిని ఒక బేసిన్ లో తీసుకుని అందులో ఒక కప్పు తరిగిన తోటకూర , తరిగిన అల్లం , తరిగిన అయిదు పచ్చిమిర్చి , స్పూను జీలకర్ర , తరిగిన కరివేపాకు , తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు మరియు తగినంత ఉప్పును అన్నీ ఈ పిండిలో వేసి చేతితో బాగా కలుపు కోవాలి .
స్టౌ మీద బాండీ పెట్టి 200 గ్రాముల నూనె వేసి నూనె బాగా కాగగానే మామూలుగా మనం వేసుకునే గారెలు మాదిరిగా వేసుకోవాలి .
అంతే వేడి వేడిగా రుచికరమైన తోటకూర గారెలు సర్వింగ్ కు సిద్ధం .