పచ్చి టమోటో లతో పచ్చడి

Listen to the NEWS

పచ్చి టమోటో లతో పచ్చడి.
కావలసినవి .
పచ్చి టమోటోలు పెద్దవి — నాలుగు లేదా 350 గ్రాములు.
పచ్చిమిరపకాయలు — పన్నెండు .
చింతపండు — చిన్న నిమ్మకాయంత
పసుపు — పావు స్పూను .
ఉప్పు — తగినంత.
కరివేపాకు — మూడు రెమ్మలు.
కొత్తిమీర — చిన్న కట్ట .
పోపునకు .
నూనె — అయిదు స్పూన్లు
ఎండుమిరపకాయలు — 5
మినపప్పు — స్పూను
మెంతులు — పావు స్పూనులో సగం
ఆవాలు — అర స్పూను
జీలకర్ర — పావుస్పూను
ఇంగువ — కొద్దిగా

తయారీ విధానము.
ముందుగా చింతపండు విడదీసి , కొద్ది నీళ్ళలో పది నిముషాల సేపు తడిపి ఉంచుకోవాలి .
పచ్చి టమోటో లు ముక్కలుగా తరుగు కోవాలి.
తర్వాత స్టౌ వెలిగించి బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి , నూనె బాగా కాగగానే పచ్చి టమోటో ముక్కలు , పచ్చిమిర్చి మరియు పావు స్పూను పసుపును వేసి , మూతపెట్టి మీడియం సెగన టమోటో ముక్కలను బాగా మగ్గనివ్వాలి .

తర్వాత వీటిని వేరే పళ్ళెంలో తీసుకుని ఉంచుకోవాలి .
తిరిగి బాండి పెట్టి రెండు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే వరుసగా ఎండుమిర్చి , మెంతులు, మినపప్పు , జీలకర్ర , ఆవాలు , ఇంగువ మరియు కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి .
తర్వాత మిక్సీ లో ఎండుమిరపకాయలు , చింతపండు , మగ్గిన టమోటో ముక్కలు , పచ్చిమిర్చి మిశ్రమము , తగినంత ఉప్పు మరియు నానబెట్టిన చింతపండు ను వేసుకుని , మరీ మెత్తగా కాకుండా మిక్సీ వేసుకోవాలి .
తర్వాత మిగిలిన పోపు , కొత్తిమీర కూడా వేసి ఒకసారి పైపైన మిక్సీ వేసుకోవాలి .
అంతే ఎంతో రుచిగా ఉండే పచ్చి టమోటోలతో పచ్చడి ఇడ్లీ , దోశెలు , చపాతీలు మరియు భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం.

Leave a Reply

Your email address will not be published.