మహిళల భద్రతకు ఆపద సమయంలో – హోంమంత్రి మేకతోటి సుచరిత

1) డయల్ 100… జిల్లాలో అత్యాధునిక కమాండెంట్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన డయల్ 100 కు జిల్లా ప్రజలు వారి సమస్యల పట్ల సమాచారం అందిస్తున్నారు. డయల్ 100 కు కాల్ చేసిన వెంటనే నిమిషాల వ్యవధిలో సంఘటనా స్ధలానికి పోలీసులు చేరుకుంటున్నారన్నారు. మహిళల సమస్యల ప్రాముఖ్యతను బట్టి వెంటనే వాటిని పరిష్కరిస్తున్నామన్నారు.

2) మహిళా సహాయ వాణి…. డయల్ 112 అత్యవసర హెల్ప్ లైన్, డయల్ 181 – ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ ఈ నెంబర్స్ ద్వారా 24 x 7 ప్రజలకు పోలీసు సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.

3) సైబర్ మిత్ర….. గౌరవనీయ రాష్ట్ర డిజిపి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సైబర్ మిత్ర హైల్ప్ లైన్ వాట్సప్ నెంబర్ 9121211100 ను జిల్లా వ్యాప్తంగా తెలియజేస్తున్నామన్నారు. సోషల్ మిడియా ద్వారా మహిళలను వేధిస్తున్న సమస్యలపై సైబర్ మిత్ర వాట్సప్ నెంబర్ కు జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపై 14 కేసులు నమోదు చేసి ఎఫ్ ఐ ఆర్ లు చేయడం జరిగిందన్నారు.

4) గ్రామ మహిళ సంరక్షణ కార్య దర్శులు…. ఆంధ్రప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో ఇటీవల కాలంలో 1,181 మందిని గ్రామ మహిళ సంరక్షణ కార్య దర్శులుగా ఏంపికచేయడం జరిగిందన్నారు. వీరు గ్రామ మహిళలకు వచ్చే సమస్యలను పరిష్కరించడంలో కృషి చేస్తున్నారన్నారు.

5) మహిళ పోలీసు వాలంటీర్స్ ….. భారత కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న మహిళా పోలీసు వాలంటీర్స్ గా జిల్లాలో వేల మందిని నియమించడం జరిగిందన్నారు. అన్ని పోలీసుస్టేషన్ల పరిధులలో ఈ మహిళా పోలీసు వాలంటీర్స్ పని చేస్తున్నారన్నారు.

6) మహిళల భద్రతకు 10 మొబైల్ అప్లికేషన్లు.. 112 ఇండియా మొబైల్ అప్లికేషన్ (ఒకే దేశం – ఒకే అత్యవసర సంఖ్య) ను ఇన్ స్టాల్ చేసుకుని అత్యవసర పరిస్ధితిలలో ఏదైనా కష్టంలో ఉన్న మహిళలు ఈ నెంబర్ ద్వారా ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు స్పందిస్తారన్నారు.

1) VithU App 2) Circle of 6 App
3) Life360 Family Locator App 4) I’m Shakti App
5) Famy Family Chat & Locator App 6) Nirbhaya: Be Fearless App
7) Watch Over Me App 8)Sentinel Personal Security SOS App
9) Secure Her App 10)Woman Safety Shield App

మహిళలు అత్యవసర సమయాలలో, ప్రమాదాలలో ఉన్నప్పుడు పోలీసుల సేవల కొరకు ఈ 10 మొబైల్ అప్లికేషన్ యాప్ ల ద్వారా సంప్రదించవచ్చు . లేదా కుటుంబాలకు, స్నేహితులకు ఈ మొబైల్ అప్లికేషన్ యాప్ ల ద్వారా SOS మెసెజ్ లు పంపించవచ్చన్నారు. ఈ SOS మెసెజ్ లు పంపించిన వెంటనే జి పి ఎస్ ల ద్వారా సంఘటన స్ధలానికి సంబంధించిన లోకేషన్ లను స్దానిక పోలీసులు తెలుసుకుంటారు .